మార్చి వరకు థర్డ్ వేవ్ రాదు.. పిల్లలను స్కూలుకు పంపడానికి భయపడొద్దు

మార్చి వరకు థర్డ్ వేవ్ రాదు.. పిల్లలను స్కూలుకు పంపడానికి భయపడొద్దు

హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు 
హైదరాబాద్:
ప్రస్తుతం కరోనా పూర్తిగా కంట్రోల్ లోనే ఉందని.. వచ్చే మార్చి వరకు థర్డ్ వేవ్ వచ్చే పరిస్థితి లేదని.. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూలుకు పంపడానికి భయపడొద్దని ఆయన భరోసా ఇచ్చారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల మంది విద్యార్థులకు టెస్ట్ లు చేస్తే 57 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చిందన్నారు. 5 లక్షల మంది రెసిడెన్స్, హాస్టల్స్ లో చదువు కుంటున్నారు.. అవి కూడా స్టార్ట్ చేస్తున్నామని వివరించారు.  దేశంలో కేరళ, మహారాష్ట్ర లలో మాత్రమే కేసులు ఎక్కువ ఉన్నాయని ఆయన తెలిపారు. 
కోవిడ్ అదుపులో ఉన్నా.. జాగ్రత్తలు తీసుకుంటున్నాం
రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉన్నప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. 27 వేల పడకలకు ఆక్సిజన్ కల్పిస్తున్నామన్నారు. ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే అనే అనుమానంతో 3202 బెడ్స్ ను పిల్లల కోసం ఏర్పాటు చేశామన్నారు. కరోనా కంట్రోల్ కోసం 113 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. డెల్టా వేరియంట్ పూర్తిగా తగ్గలేదు కాబట్టి అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆయన సూచించారు. ఐటీ కంపెనీలు ఇంకా ఓపెన్ కాలేదు.. వర్క్ ఫ్రొం హోమ్ చేస్తున్నారు.. ఐటీ కంపెనీలు కూడా ఓపెన్ చేయాలని ఆయన సూచించారు. ఐటీ కంపెనీల మీద చాలా రంగాలు ఆధారపడి ఉన్నాయని, లక్షలాది మందికి  ఉపాధి దొరకాలన్నారు. 
జీహెచ్ఎంసీలో వంద శాతం వ్యాక్సినేషన్
జీహెచ్ఎంసీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామని..  2 కోట్ల డోసులు ఇప్పటి వరకు ఇచ్చామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వివరించారు.  మూడు వారాల్లో 8.75 లక్షల మందికి మొబైల్ టీముల ద్వారా వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో 49 శాతం మంది ఒక్క డోస్ కూడా తీసుకొనివారు ఉన్నారని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 98 శాతం మంది హాస్పిటల్ కు వెళ్లవలసిన అవసరం రావడం లేదన్నారు. 
కొత్త వేరియంట్ వస్తేనే థర్డ్ వేవ్ వస్తుంది.. లేదంటే రాదు
కరోనా థర్డ్ వేవ్ రావాలంటే కొత్త వేరియంట్ రావాలని.. లేదంటే వచ్చే పరిస్థితి లేదని.. కొత్త వేరియంట్ వచ్చే వరకు 3వ వేవ్ రాదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి రోజు 3 లక్షల మందికి వ్యాక్సినేషన్ ఇస్తామని,.. 20 లక్షల వ్యాక్సిన్ ప్రస్తుతం అందుబాటులో ఉందన్నారు. ఈ నెలలో 25 లక్షల డోసులు రాబోతున్నాయని, ఈ సీజన్ లో వచ్చే రోగాలకు అన్ని ఒకే లక్షణాలు ఉంటాయన్నారు. 95 శాతం వైరల్ ఫీవర్స్.. మలేరియా 2 జిల్లాలో ఎక్కువగా వస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ సీజన్ లో ప్రతి నెల 2 లక్షల వరకు... వైరల్ ఫీవర్ వస్తుంటాయని ఆయన వివరించారు. పరిస్థితులను విశ్లేషిస్తే వచ్చే 6 నెలల వరకు థర్డ్  వేవ్ రాదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆర్ ఫ్యాక్టర్ .5శాతం , పాజిటివిటి రేట్ 4.5శాతం మాత్రమే ఉందని ఆయన తెలిపారు.