మాలెగావ్‌‌‌‌‌‌‌‌ పేలుళ్ల కేసు..నలుగురు నిందితులకు బెయిల్‌‌‌‌‌‌‌‌

మాలెగావ్‌‌‌‌‌‌‌‌ పేలుళ్ల కేసు..నలుగురు నిందితులకు బెయిల్‌‌‌‌‌‌‌‌

ముంబై: 2006 మాలెగావ్‌‌‌‌‌‌‌‌ బ్లాస్ట్‌‌‌‌‌‌‌‌ కేసులో నలుగురు నిందితులకు బెయిల్‌‌‌‌‌‌‌‌ మంజూరైంది. శుక్రవారం కేసు విచారించిన బాంబే హైకోర్టు డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ ధన్‌‌‌‌‌‌‌‌సింగ్, లోకేశ్‌‌‌‌‌‌‌‌ శర్మ, మనోహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నార్వారియా, రాజేంద్ర చౌదరీలకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. 50 వేల పూచీకత్తు చెల్లించాలని జస్టిస్‌‌‌‌‌‌‌‌ మహంతియా, ఏఎమ్‌‌‌‌‌‌‌‌. బాదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. సాక్ష్యాలు తారుమారు చేసేందుకు, సాక్షులతో మాట్లాడేందుకు ప్రయత్నించకూడదని హెచ్చరించారు. కేసుకు సంబంధించి ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరించాలని బెంచ్‌‌‌‌‌‌‌‌ ఆదేశించింది. 2013 నుంచి జైల్లో ఉన్న నలుగురు నిందితులు స్పెషల్‌‌‌‌‌‌‌‌ కోర్టులో 2016లో బెయిల్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయగా.. కోర్టు దాన్ని కొట్టేసింది. నాసిక్‌‌‌‌‌‌‌‌లోని మాలెగావ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న హమీదా మసీదు దగ్గర వరుస బాంబు పేలుళ్లు సంభవించటంతో 37 మంది చనిపోగా.. దాదాపు 100 మంది గాయపడ్డారు. ముందు యాంటీ టెర్రరిజమ్‌‌‌‌‌‌‌‌ స్కాడ్‌‌‌‌‌‌‌‌ (ఏటీఎస్‌‌‌‌‌‌‌‌) కేసును విచారించగా.. ఆ తర్వాత దాన్ని సీబీఐకి అప్పజెప్పారు.