
బెంగళూరులో భారీ వర్షం కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ రోజు రాత్రి ఏడు గంటల సమయంలో జోరు వాన కురవడంతో వేర్వేరు ప్రాంతాల నుంచి బెంగళూరు వెళ్లాల్సిన విమానాలను చెన్నై ఎయిర్ పోర్టుకు మళ్లించాల్సి వచ్చింది.
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్స్ దిగేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో నాలుగు విమానాలు చెన్నైలో ల్యాండ్ అయ్యాయి. అయితే దాదాపు గంట తర్వాత వర్షం ఆగడంతో ఆ విమానాలను తిరిగి బెంగళూరు రప్పించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.