అవినీతి ఆరోపణలు .. అజారుద్దీన్ పై నాలుగు కేసులు నమోదు

అవినీతి ఆరోపణలు ..  అజారుద్దీన్ పై నాలుగు కేసులు నమోదు


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ క్రికెటర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం  కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అజారుద్దీన్‌పై నాలుగు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అజారుద్దీన్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఆయనపై నాలుగు కేసులు నమోదయ్యాయి.  తనపై నమోదైన నాలుగు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం మల్కాజిగిరి కోర్టుపిటిషన్ దాఖలు చేశారు అజారుద్దీన్.   దీనిపై  కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది.   

హెచ్‌సీఏలో కోట్ల రూపాయల నిధులు గోల్‌మాల్ చేశారని.. టెండర్ల పేరుతో థర్డ్ పార్టీకి నిధులు కట్టబెట్టారని అజారుద్దీన్‌పై కేసు నమోదు అయింది. ఆయనపై సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ లావు నాగేశ్వర్‌రావు కమిటీ 4 కేసులు పెట్టింది. అజారుద్దీన్‌కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఆయనకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ స్థానం కేటాయించారు. ఆయన ఇప్పటికే పార్టీ నుంచి బీఫామ్ కూడా అందుకున్నారు.  కోర్టు తీర్పు వెల్లడైన తరువాత నామినేషన వేయాలని అజారుద్దీన్‌ భావిస్తున్నారు.