శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్లపై కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు సొంత కార్లలో ఆంద్రా తెలంగాణ నుంచి భారిగా తరలివచ్చారు. ఘాట్ రోడ్డు డ్రైవింగ్ వాహనదారులకు అవగాహన లేకపోవడం ఎక్కడపడితే అక్కడ రోడ్లపక్కన కార్లు పార్కింగ్ చేయడం వల్ల సాక్షిగణపతి హటకేశ్వరం వద్ద భక్తులకు వాహనాలకు రోడ్లపై తీవ్ర అంతరాయం ఏర్పడింది.
దీంతో శ్రీశైలం నుంచి సాక్షిగణపతి హాటకేశ్వరం వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైలం నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ నియంత్రించేందుకు పోలీసులు వాహనాలను క్రమబద్దీకరిస్తున్నారు.
సాక్షిగణపతి ఆలయం వద్ద వాహనాల పార్కింగ్ ప్రదేశం సరిగ లేకపోవడంతో వాహనాలు రోడ్లపక్కన నిలపడం వచ్చి వెళ్లే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు సింగిల్ రోడ్డు కావడంతో ఇరుకైన రోడ్లు ఘాట్ రోడ్డు కావడంతో వాహనాలకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సాక్షిగణపతి నుంచి హటకేశ్వరం వరకు పూర్తిగా వాహనాలు రోడ్లపై ఆగిపోయాయి. నిన్న ఆదివారం కావడంతో ఆంద్రా తెలంగాణ నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దితో శ్రీశైలం ఆలయం కిక్కిరిసింది స్వామివారి దర్శనానికి సుమారు మూడు గంటలు సమయం పడుతుంది భక్తులతో శ్రీశైలం ఆలయం క్యూలైన్లు కంపార్ట్మెంట్లన్ని నిండిపోయాయి.
