వడోదరా జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

వడోదరా జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

గుజరాత్ లోని వడోదరా జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో 40 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. సావ్లి పట్టణంలోని ఓ కూరగాయల మార్కెట్ వద్ద ఓ వర్గం వారు తమ మత జెండాను ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టారు. అయితే దానికి దగ్గర్లోనే ఓ దేవాలంయం కూడా ఉండడం ఈ ఘటనకు ప్రధాన కారణంగా మారింది. దీంతో మరో వర్గం వారు ఆందోళన చేపట్టారు. తమ మతపరమైన మనోభావాలు దెబ్బతీశారనే కారణంతో వారు నిరసన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య అల్లర్లు మొదలయ్యాయి. దీంతో అక్కడి వాతావరణమంతా ఉద్రిక్తతంగా మారింది. ఈ క్రమంలోనే ఇరువర్గాలు రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ రాళ్లదాడిలో పోలీసు వాహనాలు సైతం ధ్వంసమయ్యారు. ఈ ఘటనలో మొత్తం 40మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీనికంటే ముందు గర్భా వేదికపైకి రాళ్లు రువ్విన ఘటనలో ఆరుగురితో, మరో జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన గుజరాత్ లోని ఖేడా జిల్లా ఉండేలా గ్రామంలో చోటుచేసుకుంది.