
బ్రెజిల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సావోపా రాష్ట్రంలోని టగ్వా నగరానికి సమీపంలో హైవేపై బస్సు, ట్రక్కు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 40 మంది మరణించగా మరో 10 మందికి పైగా గాయాలయ్యాయి. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 53 మంది ఉన్నారు. మృతులంతా టెక్స్‌టైల్ కంపెనీ ఉద్యోగులుగా గుర్తించారు. ప్రమాదానికి కారణాలపై ఆరాదీస్తున్నారు. మృతుల సంతాపంగా టగ్వా నగరంలో మూడు రోజులు సంతాపం ప్రకటించారు అధికారులు.