ప్రజాపాలనకు 40.57 లక్షల దరఖాస్తులు: సీఎస్​ శాంతి కుమారి

ప్రజాపాలనకు 40.57 లక్షల దరఖాస్తులు: సీఎస్​ శాంతి కుమారి


హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు కోసం తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి మూడు రోజుల్లో 40,57,592 దరఖాస్తులు వచ్చాయని సీఎస్​శాంతి కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఒక్క రోజే రాష్ట్రంలోని1,991 గ్రామాలు, 1,877 మున్సిపల్​వార్డుల్లో నిర్వహించిన ప్రజాపాలనలో18,29,107 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఐదు గ్యారంటీల కోసం 15,88,720 అప్లికేషన్​లు రాగా ఇతర అంశాలకు సంబంధించి 2,40,387 అప్లికేషన్లు వచ్చాయని పేర్కొన్నారు. మూడు రోజుల్లో 3,868 గ్రామ పంచాయతీలు, 8,697 మున్సిపాలిటీల్లో ప్రజాపాలన కార్యక్రమం పూర్తయిందని వెల్లడించారు.