ప్రకృతి పగబట్టింది: మయన్మార్​ లో 4.1 తీవ్రతతో మళ్లీ భూకంపం.. సహాయక చర్యల్లో ఆపరేషన్​ బ్రహ్మ

ప్రకృతి పగబట్టింది: మయన్మార్​ లో 4.1 తీవ్రతతో  మళ్లీ భూకంపం..  సహాయక చర్యల్లో ఆపరేషన్​ బ్రహ్మ

మయన్మార్​ దేశంపై ప్రకృతి పగబట్టింది.  వరుస భూకంపాలతో జనాలు విలవిల్లాడిపోతున్నారు. ఏప్రిల్​ 9న జరిగిన విధ్యంసం నుంచి బయటపడకముందే..  మళ్లీ 4.1 తీవ్రతతో  భూకంపం మయన్మార్​ను కుదిపేసిందని  నేషనల్​ సెంటర్​ ఫర్​ సిప్మాలజీ (NCS) తెలిపింది.  ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని.. ఇంకా ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. 

మయన్మార్​లో సంభవించిన భూకంపం గురించి NCS ట్వీట్​ చేస్తూ ..EQ of M: 4.1, On: 11/04/2025 08:02:14 IST, Lat: 18.34 N, Long: 95.89 E, Depth: 10 Km, Location: Myanmar అని పేర్కొంది. గురువారం ( ఏప్రిల్​ 10)  భారత సహాయ బృందం నేపిటావ్‌లోని 6 ప్రదేశాల్లో  భూకంపం వచ్చే అవకాశం ఉందని  అంచనా వేసినట్లే  మయన్మార్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

మార్చి 28న 7.7 తీవ్రతతో సంభవించిన వినాశకరమైన భూకంపం తర్వాత ఇది జరిగింది, మయన్మార్​ లో  భారతదేశం ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించి సహాయం ..  వైద్య సహాయం అందించింది. ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ లో  వేలాది మంది రోగులకు చికిత్స అందించడంతో, భారత బృందాలు నేపిటావ్ మరియు మండలేలలోని ప్రదేశాలను అంచనా వేశాయి.


ఏప్రిల్ 9 న సంభవించిన భూకంప తీవ్రతకు  ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్‌లో మొత్తం 1,651 మంది రోగులు చికిత్స పొందుతున్నారని ..  ఆ రోజు  ( ఏప్రిల్​ 9) న  281 మంది రోగులు చికిత్స పొందారని ఆర్మీ అధికారులు తెలిపారు.  ఇప్పటి వరకు 38 మైనర్ సర్జరీలను చేశారు.  ఇండియన్​ ఆర్మీకి చెందిన ఇంజనీర్ల బృందం (19 ER) మండలే.. నుంచి  నే పై టావ్‌కు  మధ్యలో గుర్తించిన  భవనాలను  కూల్చివేసేందుకు  ఆ దేశానికి చెందిన  నిర్మాణ మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమైంది.. మయన్మార్‌లో దెబ్బతిన్న భవనాలను అంచనా వేయడానికి భారత సైన్యం రోబోటిక్ మ్యూల్స్ ...  నానో డ్రోన్‌లను మోహరించింది.

VIDEO | Myanmar Earthquake: Indian Army has deployed robotic mules and nano drones to assess damaged buildings in Myanmar. They are conducting technical evaluations and search-and-rescue operations using the modern equipment.#MyanmarEarthquake

(Source: Indian Army) pic.twitter.com/qwOnthTiBh

— Press Trust of India (@PTI_News) April 11, 2025

ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు   మార్చి 28న మయన్మార్‌లో సంభవించిన 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపంలో శుక్రవారం ( ఏప్రిల్​ 11)  నాటికి 3 వేల 645 మంది మరణించారు, 5వేల17 మంది గాయపడ్డారు.  ఇంకా  148 మంది ఆచూకీ తెలియరాలేదని అధికారులు ప్రకటించారు. 

Widening #OperationBrahma. After assessing 6 affected sites in Mandalay, the safety & demolition engineers team from India assessed 6 sites in Naypyitaw today. And an Orthopedic surgeon from our Medical team is assisting treatment of 70 patients at a Naypyitaw Hospital.@MEAIndia pic.twitter.com/Kp82EQPFkS

— India in Myanmar (@IndiainMyanmar) April 10, 2025