భద్రాచలం, వెలుగు : మావోయిస్ట్ పార్టీకి చెందిన 41 మంది బుధవారం చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 39 మంది సౌత్ సబ్‌జోనల్ బ్యూరోకు చెందిన వారు ఉన్నారు. లొంగిపోయిన వారిలో 12 మంది మహిళలు, 29 మంది పురుషులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరందరిపై రూ.1.19 కోట్ల రివార్డు ఉంది.
సౌత్ సబ్ జోనల్ బ్యూరోలోని దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ స్టేట్కమిటీ, ధమ్త్రీ, గరియాబంద్, నువాపాడ్ డివిజన్ కమిటీలకు చెందిన మావోయిస్టులు లొంగిపోయారని ఎస్పీ జితేంద్రయాదవ్ తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలను అందజేశారు.
