స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. సీఎం రేవంత్కు ధన్యవాదాలు తెలిపిన బీసీ నేతలు

స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. సీఎం రేవంత్కు ధన్యవాదాలు తెలిపిన బీసీ నేతలు

స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలనే నిర్ణయంపై బీసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. శనివారం (జులై 12) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ,వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ బీసీ నేతలు. ఈ కార్యక్రమం లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణా రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కులగణన చాలా పకడ్బందీగా చేశామని  బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వ్యక్తులు స్వయం గా తమ వివరాలను డిక్లేర్ చేశారని.. కులగణన డేటాను 100 శాతం డిజిటలైజేషన్ చేశామని చెప్పారు.  భవిషత్తు లో ఎవరూ ఛాలెంజ్ చేయడానికి వీలు లేకుండా డేటా భద్రపరిచామని తెలిపారు. 

దేశం లో  తెలంగాణ కులగణన తెచ్చిన రాష్ట్రంగా  బెస్ట్ మోడల్ గా నిలచిందని రాహుల్ గాంధీ కొనియాడినట్లు రేవంత్ తెలిపారు. బీసీ రిజర్వేషన్ ఫలాలను ఆయా వర్గాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీ విజయమని అన్నారు సీఎం. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేదని విమర్శించారు.