కొత్తగా పెడుతున్న గోల్డ్‌‌‌‌ షాపు.. మార్వాడీలదనుకుని నిప్పు పెట్టారు.. కానీ తర్వాత తెలిసిన నిజం ఏంటంటే..

కొత్తగా పెడుతున్న గోల్డ్‌‌‌‌ షాపు.. మార్వాడీలదనుకుని నిప్పు పెట్టారు.. కానీ తర్వాత తెలిసిన నిజం ఏంటంటే..

సదాశివనగర్‌‌‌‌, వెలుగు: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో కొత్తగా బంగారు షాపు ఏర్పాటు పనులు జరుగుతుండగా కిరోసిన్‌‌‌‌ పోసి నిప్పు పెట్టిన వారిలో మండల కేంద్రానికి చెందిన అవుసుల శ్రీధర్‌‌‌‌ను అరెస్ట్​చేసి రిమాండ్‌‌‌‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. అతడితో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారం రోజుల కింద మండల స్వర్ణకారుల సంఘ ప్రతినిధులు మార్వాడీ గో బ్యాక్‌‌‌‌ అంటూ బంగారు షాపు ఏర్పాటు చేయవద్దని డిమాండ్‌‌‌‌ చేస్తూ ఎస్సై, ఎంపీడీవో, తహసీల్దార్‌‌‌‌, స్థానిక నాయకులకు వినతిపత్రం ఇచ్చిన విషయం తెలిసిందే.

రాజస్థాన్‌‌‌‌కు చెందిన ఒక వ్యాపారి సదాశివనగర్‌‌‌‌లో మూడేండ్ల కింద కిరాణా షాపు ప్రారంభించారు. తాజాగా అతడి బంధువులు బంగారు షాపు ఏర్పాటు చేస్తుండగా స్వర్ణకారుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు షాపులోకి వెళ్లి ఫర్నిచర్‌‌‌‌పై కిరోసిన్‌‌‌‌ పోసి నిప్పు పెట్టారు. దీంతో కొంత ఫర్నిచర్‌‌‌‌ దగ్ధమైంది. బంగారు షాపు మార్వాడీలది కాదని, తనదేనని ఇంటి యజమాని ప్రభులింగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అవుసుల శ్రీధర్‌‌‌‌పై అనుమానం ఉందని తెలుపగా అరెస్ట్​చేసి విచారిస్తున్నారు.