అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ హైమావతి

అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్​రాహుల్​రాజ్​హెచ్చరించారు. మంగళవారం ఆమె నారాయణరావు పేట మండల కేంద్రంలో పర్యటించారు. పీహెచ్​సీని సందర్శించి అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేసి మెడికల్ ఆఫీసర్ బాపు రెడ్డి లీవ్ లో ఉన్నట్లు తెలపగా డీఎంహెచ్​వోతో ఫోన్ మాట్లాడారు. సమయానికి విధులకు హాజరుకాని సిబ్బందికి ఆబ్సెంట్ వేసి జీతం కట్ చెయ్యాలని డీఎంహెచ్​వోను ఆదేశించారు. 

మండల కేంద్రంలో నిర్వహిస్తున్న  డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించి ప్రతి ఇంట్లో  నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలన్నారు.  ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ లో భాగంగా మొదటి ప్రతిమను కలెక్టర్ కు అందజేశారు. 

దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. కలెక్టరేట్ లో ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వే అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను తహసీల్దార్లు వెంటనే పరిష్కరించాలన్నారు. సర్వే చేయడంలో సర్వేయర్లు ఆలస్యం చేయకుండా చూడాలన్నారు.