తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

 తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నాలుగు రోజులు భారీ  నుంచి అతి భారీ వర్షాలు

 తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది భారత వాతావరణ శాఖ. ఆగస్టు 26న ఉదయం ఉత్తర పశ్చిమ బంగాళాఖాతం  ఒడిశా తీర ప్రాంతం వద్ద  బలపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో  ఆగస్టు 26, ఆగస్టు 27న  పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది .ఈ అల్పపిడనం వచ్చే రెండు రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర అల్పపీడంగా మారే అవకాశం ఉంది.   

ఆగస్టు 26న జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో   అతి భారీ వర్షాలు.. 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

ఆగస్టు 27న  ఖమ్మం,కొమరం బీమ్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహాబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.   ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.  

ALSO READ : బీహార్లో ఓటరు అధికార్ యాత్ర..

ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే  ఛాన్స్ ఉందని తెలిపింది.