
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
జగదేవ్పూర్, (కొమురవెల్లి), వెలుగు: కొండపోచమ్మ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం జగదేవపూర్ మండలంలోని కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సమీపంలో బీర్ల ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డితో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారంతో కొండపోచమ్మ ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆలయం వద్ద విద్యుత్ దీపాల ఏర్పాటు విషయాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకవెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు. ఏఎంసీ చైర్మన్ లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, రమేశ్, మాజీ ఎంపీటీసీలు మహేందర్ రెడ్డి, మహేశ్, రమ్య రవి, చంద్రశేఖర్ రెడ్డి, కరుణాకర్, అజీజ్, ఈఓ రవికుమార్, ఆలయ సిబ్బంది కనకయ్య, హరిబాబు పాల్గొన్నారు.