కుంటాల మండలంలో అన్నా బాహు సాఠే విగ్రహావిష్కరణ

కుంటాల మండలంలో అన్నా బాహు సాఠే విగ్రహావిష్కరణ

కుంటాల , వెలుగు: సాహిత్య సామ్రాట్ అన్నా బాహు సాఠే జీవితం నేటి తరానికి ఆదర్శమని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ అన్నారు. కుంటాల మండలంలోని అంబకంటిలో ఏర్పాటు చేసిన అన్నా బాహు సాఠే విగ్రహాన్ని  మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళితులు చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని రంగాల్లో రాణించాలన్నారు. 

కమ్యూనిటీ హాల్ నిర్మాణంతో పాటు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు పక్కాగా జరిగేలా చూస్తానన్నారు. విగ్రహ దాత పిప్పెర వెంగల్ రావును ఎమ్మెల్యే గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్ పసుల నవీన్, నాయకులు ఆప్క గజ్జరాం, నాయకులు గాయక్ వాడ్ గంగాధర్, షేల్కే ఆనంద్, నామత్కర్ దిగంబర్, మేకల శ్రీనివాస్, లింగా శంకర్ తదితరులు పాల్గొన్నారు.