
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయ హుండీ లెక్కింపు మంగళవారం ఈవో అన్నపూర్ణ, దేవాదాయశాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. 46 రోజుల్లో రూ.45,79,870 నగదు, విదేశీ కరెన్సీ 83 నోట్లు, మిశ్రమ బంగారం 44 గ్రాములు, మిశ్రమ వెండి 4 కిలోల 800 గ్రాములు వచ్చినట్లు తెలిపారు.
ఈ మొత్తం డబ్బులను స్థానిక ఎస్బీఐ బ్యాంకులో జమ చేసినట్లు ఈఓ పేర్కొన్నారు. అనంతరం వేద పాఠశాల విద్యార్థులు తయారుచేసిన మట్టి గణపతులను ప్రభుత్వ స్కూల్లో పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో బుద్ధి శ్రీనివాస్, మహదేవుని మల్లికార్జున్, ధర్మకర్తలు పోలీస్ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.