బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు కృషి : కె.వెంకటేశ్వర్లు

బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు కృషి : కె.వెంకటేశ్వర్లు

కోల్​బెల్ట్/నస్పూర్, వెలుగు: సింగరేణి కంపెనీ వార్షిక నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉద్యోగులంతా కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్​(ప్రాజెక్ట్, ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం శ్రీరాంపూర్​తోపాటు మందమర్రి ఏరియా కల్యాణిఖని ఓపెన్​కాస్ట్, కేకే-5 అండర్ ​గ్రౌండ్​ గనులను డైరెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా గనుల్లో బొగ్గు ఉత్పత్తి,ఉత్పాదకత,పనిస్థలాలను తనిఖీ చేశారు. 

అనంతరం జీఎం ఆఫీసుల్లో ఏరియాల జీఎంలు, శ్రీనివాస్, దేవేందర్​తో కలిసి రివ్యూ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేసినప్పుడే నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. వర్షాకాలంలో ఉత్పత్తికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బెల్లంపల్లి, రామగుండం రీజియన్ సేఫ్టీ జీఎంలు రఘుకుమార్, మధుసూదన్, ఎస్వోటూ జీఎంలు ఎన్.సత్యనారాయణ, విజయప్రసాద్​ తదిత రులు పాల్గొన్నారు.