మటన్ సూప్ మూవీ నుంచి హర హర శంకర సాంగ్ రిలీజ్..

మటన్ సూప్ మూవీ నుంచి హర హర శంకర సాంగ్ రిలీజ్..

రమణ్, వర్షా విశ్వనాథ్ జంటగా రామచంద్ర వట్టికూటి రూపొందిస్తున్న చిత్రం ‘మటన్ సూప్’.  మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ మూవీ నుంచి  ‘హర హర శంకర’ సాంగ్‌‌‌‌‌‌‌‌ను నటుడు తనికెళ్ళ భరణి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘విఘ్నేశ్వరుడి దయతో ఏ విఘ్నాలు లేకుండా ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. ‘హర హర శంకర’ పాటలో సమాజంలో జరుగుతున్న ఘోరాల్ని చూపించారు. 

ఈ మూవీ టీమ్ అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోందని, సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సినిమా రిలీజ్‌‌‌‌‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నామని  దర్శకుడు రామచంద్ర చెప్పాడు. ఈ చిత్రంలోని  ప్రతి  సీన్ జీవితంలో జరిగినట్టుగా అనిపిస్తుందని హీరో రమణ్ అన్నాడు. భరణి గారు ఈ సాంగ్ లాంచ్ చేయడం ఆనందంగా ఉందని నిర్మాతలు చెప్పారు. నటులు గోవింద్, సునీత మనోహర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు పాల్గొన్నారు.