
రాష్ట్రాలకు 6 వేల కోట్లు ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ, వెలుగు: జీఎస్టీ పరిహారంలో భాగంగా వీక్లీ ఇన్స్టాల్మెంట్ కింద రూ.6 వేల కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు రూ.429.45 కోట్లు ఇచ్చింది. ఈమేరకు బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వు లు జారీ చేసింది. 23 రాష్ట్రాలకు రూ.5,516.60 కోట్లు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.484.40 కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. ఆయా రాష్ట్రాల జీఎస్ డీపీలో 0.50% కేటాయించి నట్లు అధికారులు చెప్పారు. ఇందులో ఏపీకి రూ. 929.97 కోట్లు అందాయి. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు నిధులు ఇస్తుండడంతో ఇప్పుడు ఇవ్వలేదని కేంద్రం వివరణ ఇచ్చింది.