43 కోట్ల మందికి.. 22 లక్షల కోట్ల అప్పు : నిర్మల

43 కోట్ల మందికి.. 22 లక్షల కోట్ల అప్పు : నిర్మల

మోదీ ప్రభుత్వ హయాంలో.. 2023 సంవత్సరంలోనే దేశ వ్యాప్తంగా పీఎం ముద్ర యోజన కింద 43 కోట్ల మందికి.. 22 లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వటం జరిగిందని స్పష్టం చేశారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై పార్లమెంట్ లో మాట్లాడిన ఆమె.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవటంలో ప్రభుత్వం ఎంతో ఉదారత చూపిందని స్పష్టం చేశారు. కరోనా తర్వాత చితికిపోయిన చిన్న పరిశ్రమలను ఆదుకోవటం కోసం లక్ష్యాలను మించి.. అదనంగా 2 లక్షల కోట్ల రూపాయల వరకు రుణాలు ఇవ్వటం జరిగిందని వెల్లడించారామె. 

అదే విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీయా యోజన కింద దేశంలో 4 కోట్ల మంది రైతులకు పంటల బీమా అందించామని సభలో ప్రకటించారామె. రైతులు పండించిన పంటలలను అమ్ముకోవటం కోసం 3 లక్షల కోట్ల రూపాయలతో.. ఒక వెయ్యి 361 మార్కెట్ యార్డులను అనుసంధానించటం జరిగిందని.. దీని వల్ల పంటల అమ్మకం ద్వారా రైతులు అధిక ప్రయోజనం పొందారని వెల్లడించారమె.

ప్రపంచ దేశాలకు భారత దేశం నుంచి ఆహార ధాన్యాలను ఎగుమతి చేయటంలో ముందున్నామని.. ఇది రైతుల విజయం అని.. ప్రభుత్వం సాధించిన ప్రగతిగా అభివర్ణించారు మంత్రి నిర్మల సీతారామన్.