టెన్త్ పరీక్షలు : తండ్రి పాస్.. కొడుకు ఫెయిల్

టెన్త్ పరీక్షలు : తండ్రి పాస్.. కొడుకు ఫెయిల్

పూణేకు చెందిన 43 ఏళ్ల ఓ వ్యక్తి అతని కొడుకు ఇద్దరు కలిసి ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. అయితే పరీక్షల ఫలితాల్లో తండ్రి పాస్ అవ్వగా కొడుకు మాత్రం ఫెయిల్ అయ్యాడు. భాస్కర్ వాఘ్‌మారే అనే వ్యక్తి పూణే నగరంలో నివాసం ఉంటున్నాడు. అతనికి చదువుకోవాలన్న కోరిక ఎంతో ఉండేది. కానీ కుటుంబ పరిస్ధితుల దృష్ట్యా 7వ తరగతి వరకే చదువుకున్నాడు. అ తర్వాత కుటుంబ పోషణ కోసం ఓ ఉద్యోగంలో చేరాడు. కానీ చదువుకోవాలన్న కోరిక మాత్రం అతనికి అలాగే ఉండిపోయింది. దీనితో 30 ఏళ్ల తర్వాత ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. కష్టపడి చదివి పాస్ అయ్యాడు. కానీ తన కొడుకు మాత్రం ఈ పరీక్షల్లో  రెండు పేపర్లలో ఫెయిల్ అవ్వడం అతనికి కాస్త నిరాశను మిగిల్చింది. సప్లిమెంటరీ పరీక్షలలో తన కొడుకుని గైడ్ చేస్తానని, వాటిని ఈ పరీక్షల్లో క్లియర్ చేస్తాడని ఆశిస్తున్నట్టుగా భాస్కర్ వాఘ్‌మారే వెల్లడించారు.