మూడు నెలల్లో 439 అక్రమ నిర్మాణాల కూల్చివేత

మూడు నెలల్లో 439 అక్రమ నిర్మాణాల కూల్చివేత

హైదరాబాద్, వెలుగు: గడిచిన మూడు నెలల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ సిటీలోని 439 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అన్ని రకాల అనుమతులు తీసుకున్నాకే నిర్మాణాలు మొదలుపెట్టాలని సూచించారు. టీఎస్​ బి–పాస్ రూల్స్​పాటించకుండా చేపడుతున్న నిర్మాణాలు, లేఅవుట్లపై చర్యలు తీసుకోవడానికి జోనల్ కమిషనర్ నేతృత్వంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్​ పనిచేస్తున్నాయని చెప్పారు.