తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ.. జీహెచ్ఎంసీ కమిషనర్ గా అమ్రపాలి

తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ.. జీహెచ్ఎంసీ కమిషనర్ గా అమ్రపాలి

తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది కాంగ్రెస్ సర్కార్. బల్దియా కమిషనర్ గా ఉన్న రొనాల్డ్ రాస్ ను ట్రాన్స్ ఫర్ చేసింది. ఇక ఆయన స్థానంలో హెచ్ఎండీఏ ఎండీగా ఉన్న అమ్రపాలిని బల్దియా కమిషనర్ గా నియమించింది. మొత్తం 44 మంది IAS లను బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి( సీఎస్) శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

 ట్రాన్స్ కో సీఎండీగా రొనాల్డ్ రాస్.. సందీప్ కుమార్ సుల్తానియాను ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గా నియమించింది సర్కార్. ఇక, టూరిజం, స్పోర్ట్స్ డైరెక్టర్‌గా వాణిప్రసాద్, దేవాదాయ కమిషనర్‌గా శైలజా రామయ్యర్‌, జలమండలి ఎండగా అశోక్ రెడ్డిని నియమిస్తూ సర్కార్ ఆదేశాలు  జారీ  చేసింది

 కాగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 20 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు చేసిన సంగతి తెలిసిందే.