హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో 45 అంశాలతో పాటు 8 టేబుల ఐటమ్ లకు సభ్యులు ఆమోదం తెలిపారు. రెండు టేబుల్ ఐటమ్ తో పాటు ఒక అంశంపై కౌన్సిల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో ప్రధానంగా సీఆర్ఎంపీ ఫేజ్–2 కింద 1045 కిలోమీటర్ల మేరా బీటీ, సీసీ రోడ్లను నిర్వహణలకు అప్పగించేందుకు పరిపాలనా అనుమతితో పాటు మౌలాలి రైల్ ఓవర్ బ్రిడ్జి పునరుద్ధరణ పనుల కోసం పరిపాలన అనుమతుల కోసం కమిటీ సభ్యులు ఆమోదించారు.
ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, బానోతు సుజాత, సీఎన్ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ లు వినయ్ కృష్ణారెడ్డి , సృజన , పంజక, మంగతయారు తదితరులు పాల్గొన్నారు.
