తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్‌లోని జ్యోతిష్మతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫైనలియర్ బీ ఫార్మసీ విభాగానికి చెందిన 44 మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సత్తా చాటారు. రూ.3లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించారని కాలేజీ చైర్మన్ జువ్వాడి సాగర్ రావు తెలిపారు.
హైదరాబాద్‌కు చెందిన 'మెడ్ ప్లస్' ఆప్టివల్ హెల్త్ సొల్యూషన్స్ హెచ్ఆర్ ఆకుల రాజు ఆధ్వర్యంలో జరిగిన రిక్రూట్మెంట్లో ట్రైనీ ఫార్మసిస్ట్‌లుగా ఎంపికై, రూ.3లక్షల వార్షిక ప్యాకేజీని పొందారన్నారు. సంస్థ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జె.సుమిత్ సాయి, ప్రిన్సిపాల్ వి.రాజ్‌కుమార్ విద్యార్థులను అభినందించారు.
