పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం వద్ద గురువారం 4.5 కిలోల గంజాయిని ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఎస్‌ఐ శ్రీహరి రావు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో రెండు ద్విచక్ర వాహనాలపై గంజాయిని తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ అయిన వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన ఎస్‌కే మహమ్మద్ అవేజ్ భాష, పుష్పాల జగన్నాథ్‌తో పాటు ఒడిశాకు చెందిన ప్రసన్నజిత్ మండల్, ప్రీతం రాయ్ ఉన్నారు. వారి నుంచి 4.5 కిలోల ఎండు గంజాయి, రెండు బైక్‌లు మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకన్నారు.
