వారంలో మూడోసారి..పాక్లో మరోసారి భూకంపం

వారంలో మూడోసారి..పాక్లో మరోసారి భూకంపం

నిన్నటి వరకు భారత్ దాడులతో ఉక్కిరిబిక్కిర అయిన  పాక్ ను భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. వరుస భూ కంపాలు  పాక్ ను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రెండు రోజుల క్రితమే మే 10న పాక్ లో భూకంపం రాగా..ఇవాళ మే 12న పాకిస్తాన్ లో మరోసారి భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 4.06 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ  వెల్లడించింది. ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో వచ్చింది. భూకంపం కారణంగా, ప్రజలు  భయాందోళనతో పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఎంత నష్టం జరిగిందో ఇంకా తెలియాల్సి ఉంది. 

మే 10న పాకిస్తాన్ లో తెల్లవారు జామున 1.44 గంటలకు  పాకిస్తాన్​ లో భూమి కంపించిన  సంగతి తెలిసిందే.  భూకంప తీవ్రత  రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని తెలిపింది. 

ALSO READ | 60 సెకన్లలో 6 అబద్ధాలు చెప్పిన పాకిస్థాన్ ఆర్మీ.. ఇవి చూస్తే మీరు నవ్వుకుంటారు!

మే 5న  పాకిస్తాన్లో రిక్టర్ స్కేల్పై 4.2 తీవ్రతతో సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో పాకిస్తాన్లో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) పేర్కొంది. పాకిస్తాన్లో భూకంపం సంభవించడం వారం వ్యవధిలో ఇది  మూడోసారి  కావడం గమనార్హం. 

ఏప్రిల్ 30వ తేదీన కూడా పాకిస్తాన్లో భూకంపం కారణంగా కొంత భూభాగం కుదుపునకు లోనైంది. పాకిస్తాన్లో ఇటీవల తరచుగా భూకంపాలు సంభవిస్తుండటం గమనార్హం.