
Pakistan Lies: గతవారం పాకిస్థాన్ ఏకంగా ప్రపంచ మ్యాప్ నుంచి మాయం అవుతుందా అనే స్థాయిలో ఇండియా-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగిన సంగతి తెలిసిందే. పాక్ బుల్లెట్లతో దాడి చేస్తే ఇండియా ఏకంగా మిస్సైళ్లతో బదులివ్వటం ప్రపంచం మెుత్తం చూసింది. ఈ క్రమంలో పాకిస్థాన్ ఆర్మీ పెద్దలు తమ దేశ ప్రజల వద్ద అబద్ధాలు చెబుతూ పరువు కాపాడుకునే పనిలో పడ్డారు.
ఈ క్రమంలో తాము భారతదేశంపై తిరిగి దాడి చేసే విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాం అని ఒప్పుకోలేక కసితో ఉన్న పాక్ ఏకంగా గతంలో తాము చేసిన పుల్వామా దాడుల గురించి ఒప్పుకుండా జబ్బులు సరుసుకునే పనిలో పడింది. దీంతో ఇన్నాళ్లుగా భారత్ చెబుతున్న విషయంలో వాస్తవమేనని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు అర్థమైపోయింది. పైగా తాము కాల్పుల విరమణ కోరలేదని.. తమ సైన్యం ఇండియాకు ధీటుగా దాడులతో బదులిచ్చిందంటూ ఢంకాలు మోగించుకుంటూ పాక్ ప్రజలను మభ్యపెట్టే పనిచేసింది. కానీ ఆధునిక ఇంటర్నెట్ యుగంలో ప్రజలకు నిజాలు సోషల్ మీడియా ద్వారా తెలియటంతో పాక్ నాయకుల ముఖాన ఉమ్మేస్తున్నారు. అయినా అవన్నీ తుడుచుకుంటూ అవాస్తవాలను సర్కులేట్ చేసే పనిలో పాక్ బిజీగా ఉండటం ట్రోలింగ్ కి గురవుతోంది.
ఈ క్రమంలో కాల్పుల విరమణ ప్రకటన వచ్చిన తర్వాత పాకిస్థాన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఒక మీడియా సమావేశంలో 60 సెకన్లలో గుక్కతిప్పుకోకుండా చెప్పిన 6 అబద్ధాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నాయి. దీనిని చూస్తున్నవారు సిగ్గులేని పాకిస్థాన్ అధికారులు ఇంత వేగంగా అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నారు, వాస్తవాలు అందరికీ తెలిసినా వీరికి అబద్ధాలు చెప్పై దైర్యం ఎక్కడిదంటూ ప్రశ్నిస్తున్నారు.
60 సెకన్లలో పాక్ అధికారులు చెప్పిన 6 అబద్ధాలు ఇవే..
1. మెుదటిది పాకిస్థాన్ ఆర్మీ ఒక ప్రొఫెషనల్ ఆర్మీ అనటం. వాస్తవానికి పాల నుంచి చికెన్ వరకు అన్ని వ్యాపారాల్లో ఉన్న ఆర్మీ అంటూ ట్రోలింగ్ కొనసాగుతోంది.
2. తాము చెప్పిన మాటమీద నిలబడతాం అంటూ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. కాల్పుల విరమణకు అంగీకరించిన కొద్ది గంటల్లోనే డ్రోన్ దాడులు చేసి ట్రంప్ ని బఫూన్ చేసింది పాక్ ఆర్మీ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
3. ఇక అందరీని ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశం పాకిస్థాన్ ఆర్మీ అక్కడి ప్రభుత్వ ఆదేశాలను ఫాలో అవుతంటూ చేసిన కామెంట్స్. ప్రభుత్వంలో ప్రధానిని ఎంపిక చేసే పాక్ ఆర్మీ ప్రస్తుతం జరిగిన తప్పిదాలను షరీఫ్ మీద రుద్దుతోందని ఇది సిగ్గుచేటని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మాట వినని ప్రభుత్వాలను గతంలో పాక్ ఆర్మీ ఎలా కూల్చేసిందో అందరికీ తెలిసిందే.
►ALSO READ | ప్రధాని మోదీ నివాసంలో హై లెవెల్ మీటింగ్.. భారత్-పాక్ DGMOల చర్చలపై ఉత్కంఠ
4. ప్రస్తుతం కాల్పుల విరమణ శాంతిని స్థాపించటంతో దీనిని తమ దేశ ప్రజలు పండుగలా జరుపుకుంటున్నారని ఆర్మీ అధికారి చెప్పారు. అయితే మరో పక్క పాక్ ఆర్మీ పెద్దల అహంకారంతో జరిగిన దాడిపై సగటు పాకిస్థానీ కన్నీరు పెట్టుకుంటున్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయామని వారు చెబుతున్నారు. ఏకంగా పార్లమెంటులో ఎంపీలు కన్నీరు పెట్టుకున్న సంగతి మనం చూశాం.
5. ఇక చైనా సరుకుతో చేతులెత్తేసిన ఆర్మీ తమ రాడార్లు భారత మిసైళ్లు, డ్రోన్లను ముందుగానే పసిగట్టాయని ఎయిర్ ఫోర్స్ అధికారి చెప్పటంపై అందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే డ్లోన్లలు ప్రపంచంలోని అత్యుత్తమ రాడార్ వ్యవస్థలు కూడా గుర్తించలేవనే విషయం తెలియకపోవటంపై ట్రోల్ చేస్తున్నారు.
6. ఇక పాకిస్థాన్ నేవీ అధికారి మాట్లాడుతూ తాము ధీటుగా పరిస్థితులను ఎదుర్కొన్నామని, తమ సబ్ మెరైన్లు ఇందుకు సహకరించాయని అన్నారు. మెుత్తం పాక్ వద్ద ఉన్న 5 సబ్మెరైన్లలో 4 రిపేర్లలో ఉన్నాయని గుర్తులేదా అంటూ చాలా మంది సోషల్ మీడియాలో అటాక్ చేస్తున్నారు.