ప్రధాని మోదీ నివాసంలో హై లెవెల్ మీటింగ్.. భారత్-పాక్ DGMOల చర్చలపై ఉత్కంఠ

ప్రధాని మోదీ నివాసంలో హై లెవెల్ మీటింగ్.. భారత్-పాక్ DGMOల చర్చలపై ఉత్కంఠ

న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ సిందూర్’ విజయం తర్వాత ప్రధాని మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. కేంద్ర రక్షణ  శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీడీఎస్, NSA, త్రివిధ దళాధిపతులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీ అయ్యారు. పాక్ తో చర్చల వేళ ఈ హైలెవల్ మీటింగ్పై ఉత్కంఠ నెలకొంది.

భారత్-పాక్ DGMOల చర్చలు జరగనున్న క్రమంలో పాక్తో చర్చించాల్సిన అంశాలపై ప్రధాని మోదీ ఈ హైలెవల్ మీటింగ్లో దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. పాకిస్తాన్ మళ్లీ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే గట్టిగా బుద్ధి చెప్పాలని ఆర్మీ కమాండర్లను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్) జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే.

పశ్చిమ సరిహద్దుల్లో ఎలాంటి ప్రతిదాడులనైనా చేపట్టేందుకు ఆర్మీ కమాండర్లందరికీ ఆయన ఫుల్ పవర్స్ ఇచ్చారని ఈ మేరకు ఇండియన్ ఆర్మీ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘‘శనివారం రాత్రి పాక్ కాల్పుల విరమణ తర్వాత తాజా పరిస్థితిపై వెస్ట్రన్ బార్డర్స్ ఆర్మీ కమాండర్లతో ఆర్మీ చీఫ్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పాక్ బలగాలు మళ్లీ సీజ్ ఫైర్ ను ఉల్లంఘిస్తే.. తక్షణమే తీవ్ర స్థాయిలో ప్రతిదాడులు చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో కమాండర్లందరికీ ఫుల్ పవర్స్ ఇస్తున్నట్టు వెల్లడించారు” అని ఆర్మీ పేర్కొంది.

►ALSO READ | శత్రువులపై బ్రహ్మాస్త్రం.. యూపీలో బ్రహ్మోస్ యూనిట్ ప్రారంభం

ఇక.. పాక్ కవ్వింపు చర్యలపై ఇండియన్ ఆర్మీ డీజీఎంవో కీలక ప్రకటన చేశారు. 8–9వ తేదీ రాత్రి లాహోర్‌‌ నుంచి డ్రోన్లు, యూఏవీలతో పాకిస్తాన్.. ఇండియన్ ఎయిర్‌‌ బేస్‌‌లు, ఆర్మీ క్యాంపులను టార్గెట్‌‌ చేసిందని డీజీఎంవో తెలిపారు. డ్రోన్లు ఇండియన్ ఏయిర్​స్పేస్లోకి వచ్చాయని, అన్నింటినీ కూల్చేశామని వివరించారు.

‘‘శనివారం మధ్యాహ్నం 3.15 గంటలకు పాకిస్తాన్ డీజీఎంవో మాకు ఫోన్‌‌ చేశారు. కాల్పుల విరమణకు అంగీకరించాలని ప్రాధేయపడ్డాడు. దీంతో మేము అంగీకరించాం. కాల్పుల విరమణకు అంగీకరించామో లేదో.. కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ కాల్పులకు దిగింది. ఫైరింగ్ జరిపినందుకు పాకిస్తాన్​కు వార్నింగ్‌‌ మెసేజ్‌‌ పంపించినం. ఒకవేళ ఆదివారం రాత్రి కాల్పులు జరిపితే మీ (పాకిస్తాన్) అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చినం’’ అని డీజీఎంవో తెలిపారు.