ఫిట్‌‌నెస్ లేని 46 స్కూల్ బస్సులు సీజ్

ఫిట్‌‌నెస్ లేని 46 స్కూల్ బస్సులు సీజ్

తెలంగాణలో పాఠశాలు పునః ప్రారంభ కావడంతో విద్యార్ధులను తరలించే బస్సులపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు రవాణా శాఖా అధికారులు.   రవాణ శాఖ కమీషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్ అదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సు లను నడిపితే సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.

2024, జూన్ 12వ తేదీ రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చశారు. స్కూల్ బస్సు ఆర్ సీ, పర్మిట్, ఇన్సురెన్స్, ఫిట్‌‌నెస్, పొల్యూషన్, ఫైర్ సేఫ్టీ, ఫైర్ ఎయిడ్ కిట్ తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ను అధికారులు పరిశీలించారు. తనిఖీల సమయంలో ఫిట్‌‌నెస్ లేకుండా రోడ్డుపై నడిపిన బస్సులను కేసు నమోదు చేశారు.

జిల్లా వ్యాప్తంగా మొత్తం 46 బస్సులను రవాణా శాఖ అధికారులను సీజ్ చేశారు.  స్కూల్ బస్సుకు సంబంధించిన ఏ పత్రాలు లేకున్నా బస్సులను సీజ్ చేసి సీజింగ్ యార్డ్ కు తరలిస్తున్నారు అధికారులు.  జిల్లా వ్యాప్తంగా 12 వేల పై చిలుకు బస్సులు ఉండగా.. 8 వేల బస్సులు మాత్రమే ఫిట్‌‌నెస్  పొందినట్లు సమాచారం.