టర్కీలోదొంగతనానికి పాల్పడిన 48 మంది అరెస్ట్

టర్కీలోదొంగతనానికి పాల్పడిన 48 మంది అరెస్ట్

టర్కీలో భూకంపం సంభవించడంతో అక్కడి ప్రజల కష్టాలు వర్ణణాతీతం. ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. తమ వారిని కోల్పోయామని బాధపడుతూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఒకరికి ఒకరు సాయం చేసుకోవాల్సింది పోయి కొందరు దోపిడీకి పాల్పడుతున్నారు. హటే ఫ్రావిన్స్ లో దోపిడీకి పాల్పడిన 48 మందిని టర్కీ పోలీసులు అరెస్ట్ చేశారు.

భూకంపం కారణంగా ఆగ్నేయ టర్కీలోని 10 ఫ్రావిన్సుల్లో అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మూడు నెలల అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దోపిడీలకు పాల్పడుతున్న వారిని అదనంగా మూడు రోజుల పాటు నిర్భంధించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దోపిడీలు, కిడ్నాప్ లకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఎర్డోగాన్  హెచ్చరించారు. భూకంపం వలన టర్కీ, సిరియాలో దాదాపు 26,000 మందికి పైగా మరణించారని అక్కడి మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.