
మునగాల, వెలుగు: దుబ్బాక ఉప ఎన్నికలో సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్‌గూడెంకు చెందిన బండారు నాగరాజు నాలుగో స్థానంలో నిలిచారు. సామాజిక ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడైన నాగరాజు.. దుబ్బాకలో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆయనకు చపాతి రోలర్ గుర్తును కేటాయించింది. ఉపఎన్నికలో బండారు నాగరాజు మొత్తం 3,489 ఓట్లు సాధించారు. ఇందులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లే 60 ఉండటం గమనార్హం. గతంలో హుజూర్‌నగర్ ఉపఎన్నికలోనూ నాగరాజుపోటీ చేశారు. అప్పుడు ఆయనకు 1,600 ఓట్లు పడ్డాయి. గతంలో జరిగిన నల్గొండ లోక్సభ ఎలక్షన్లలోనూ నాగరాజు 546 ఓట్లు సాధించారు.