ఐదు సిటీల్లో ఇంటర్నేషనల్ యోగా డే

ఐదు సిటీల్లో ఇంటర్నేషనల్ యోగా డే

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల కోసం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ, సిమ్లా, మైసూర్, అహ్మదాబాద్, రాంచీలను ఎంపిక చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి బాధ్యతలు చేపట్టాక నిర్వహిస్తున్న తొలి పబ్లిక్ ఈవెంట్ ఇదే. ఐదు నగరాల్లో కార్యక్రమాల వేదికను ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ఫైనల్ చేస్తుందని అధికారులు చెప్పారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు ప్రారంభించినట్లు ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఢిల్లీలో 2015 తర్వాత రెండోసారి ఈ వేడుకలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో మొరార్జీ దేశాయ్  నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా శనివారం నుంచి రెండ్రోజులపాటు “యోగా మహోత్సవ్” కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో 10 వేల మంది పాల్గొంటారని, 21న జరిగే కార్యక్రమానికి  ప్రజలను సన్నాహకంగా ఇది ఉంటుందని అధికారులు చెప్పారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు యునైటెడ్ నేషన్స్ జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2015 జూన్ 21న తొలి ఇంటర్నేషనల్ యోగా డే వేడుకలు ఢిల్లీలోని రాజ్ పథ్ లో జరగ్గా191 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. 2016లో చండీగఢ్ లో, 2017 లో లక్నోలో యోగా డే వేడుకలు జరిగాయి