జన్నారం రూరల్, వెలుగు: బాసర ట్రిపుల్‌ఐటీకి జన్నారం మండలంలోని కిష్టాపూర్, కలమడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికైనట్లు ఆయా పాఠశాలల హెచ్‌ఎం రాజన్న, కట్ట రాజమౌళి తెలిపారు. కిష్టాపూర్‌ఉన్నత పాఠశాల విద్యార్థులు లశెట్టి శ్వేత , కట్ల సాకేత , చెరుకు అక్షయ్, కలమడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన జాడి ఆంజనేయప్రసాద్, వైష్ణవి లు ట్రిపుల్‌ఐటీ లో సీట్లు సాధించినట్లు పేర్కోన్నారు. ట్రిపుల్‌ఐటీలో సీట్లు సాధించడం పట్ల అయా గ్రామాల సర్పంచులు వాసల నరేశ్, బొంతల రాజమణిమల్లేశ్, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.
లక్సెట్టిపేట నుంచి ఇద్దరు..
లక్సెట్టిపేట : లక్సెట్టిపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థినులు బాసర ట్రిపుల్ ఐటీ కి ఎంపిక అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజ తెలిపారు. పదవ తరగతి లో ఎం. రిషిక 567 మార్కులు సాధించగా, మేడి తిరుమల 562 మార్కులు సాధించారు. వీరిద్దరూ ట్రిపుల్ ఐటీ కి ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు సిబ్బంది అభినందనలు తెలిపారు.
ఒకే స్కూల్ నుంచి ఐదుగురు..
రాయికల్, వెలుగు: జగిత్యాల జిల్లా రాయికల్మండలం భూపతిపూర్హైస్కూల్కు చెందిన ఐదుగురు విద్యార్థులు బాసర ట్రిఫుల్ఐటీకి ఎంపికైనట్లు హెచ్‌ఎం వెంకటరమణి ఆదివారం తెలిపారు. స్కూల్‌కు చెందిన మామిడిపెల్లి సరస్వతి, న్యాతగిరి సంజన, అయేషా, ధనరేకుల గంగోత్రి, దోనిపాల రాజదీపక్ ఎంపికైనట్లు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను, టీచర్లను గ్రామస్తులు అభినందించారు. కాగా ఇటిక్యాల మోడల్స్కూల్కు చెందిన కె.భావన, రోహిత్ట్రిఫుల్ ఐటీకి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ పూదరి నర్సయ్య తెలిపారు.
