పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు ఎడాపెడా వాడుతున్నారా.. అయితే మీ కిడ్నీలు, బ్రెయిన్, లివర్ మటాష్..!

పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు ఎడాపెడా వాడుతున్నారా.. అయితే మీ కిడ్నీలు, బ్రెయిన్, లివర్ మటాష్..!

మీకు తలనొప్పి, వొళ్ళు నొప్పులు లేదా దెబ్బతగిలిన ప్రతి చిన్నదానికి పెయిన్ కిల్లర్  ట్యాబ్లెట్లు వేసుకుంటుంటారా..? అయితే జాగ్రత్త.. వెంటనే నొప్పి తగ్గేందుకు పెయిన్ కిల్లర్ వేసుకోవడం ఇక ఆపేయండి. ప్రతిదానికి, ప్రతిసారి అలవాటుగా పెయిన్ కిల్లర్ వాడటం వల్ల మీరు ఊహించిన దానికంటే ఎక్కువే ఆరోగ్యానికి గురవుతారు.  ఇబుప్రోఫెన్, ఎసిటమినోఫెన్ వంటి పెయిన్ కిల్లర్ నొప్పి తగ్గించడానికి సహాయపడతాయి. అయితే ఎక్కువ మోతాదు తీసుకోవడం, ఇంట్రావీనస్ వాడకం లివర్, కిడ్నీలు, జీర్ణ వ్యవస్థపై  ప్రభావం చూపుతాయి.

అయితే నొప్పి తగ్గేందుకు పెయిన్ కిల్లర్ ఎక్కువగా వాడటం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఇవి మన మెదడులోని రసాయనాలపై చెడు ప్రభావం చూపి మనల్ని వాటికి బానిసలుగా మార్చేస్తాయి. అదే అలవాటు మెల్లిమెల్లిగా ఎక్కువ మోతాదులో వాడాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు ఎక్కువ మోతాదులో వాడితే బిపి, గుండెపోటు సమస్యలు కూడా  రావచ్చు. ఢిల్లీకి చెందిన డాక్టర్ మనీష్ కుమార్ ప్రకారం, నొప్పి తగ్గేందుకు పెయిన్ కిల్లర్ ఎక్కువగా వాడితే కాలేయం (liver), కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాకుండా మన మానసిక స్థితిని కూడా దెబ్బతీస్తుంది.

ALSO READ : కొత్త కస్టమర్లకు HDFC షాక్..

నొప్పి తగ్గే పెయిన్ కిల్లర్ వల్ల కలిగే నష్టాలు:
1. లివర్ సమస్యలు: ఎసిటమినోఫెన్ లాంటి పెయిన్ కిల్లర్ ఎక్కువగా వాడితే లివర్ చెడు పదార్థాలను బయటకు పంపే పనిని సరిగ్గా చేయలేదు. దింతో లివర్ ఉబ్బడం, దెబ్బతినడం లేదా పూర్తిగా చెడిపోయే అవకాశం ఉంది.  

2. కిడ్నీ సమస్యలు: ఇబుప్రోఫెన్ లాంటి పెయిన్ కిల్లర్ కిడ్నీలకు రక్త ప్రసరణను తగ్గిస్తాయి. దీనివల్ల కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేయలేవు. ఎక్కువ కాలం ఈ మందులు వాడితే కిడ్నీలు పాడైపోవచ్చు. ఇప్పటికే కిడ్నీ సమస్యలు, డీహైడ్రేషన్ లేదా బీపీ ఉన్నవాళ్లకు ఈ ప్రమాదం ఇంకా ఎక్కువ ఉండొచ్చు.

3. కడుపులో సమస్యలు: NSAID అని పిలిచే మందులు ఎక్కువగా వాడితే కడుపులో మంట, పుండ్లు (ulcers) ఏర్పడవచ్చు. కొన్నిసార్లు కడుపులో రక్తస్రావం కూడా జరగవచ్చు. మొదట్లో అజీర్ణంతో మొదలయ్యే ఈ సమస్యకి వైద్యం చేయకపోతే చాల ప్రమాదం. 

4. గుండెకు ప్రమాదాలు: కొన్ని నొప్పి మందులు (NSAID లు) రక్తపోటును పెంచి శరీరంలో నీరు పేరుకుపోయేలా చేస్తాయి. దీనివల్ల గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. గుండె జబ్బులు ఉన్నవారు ఈ మందులను వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

5. పెయిన్ కిల్లర్ పై ఆధారపడటం: కొన్ని నొప్పి తగ్గించే మందులు (opioids) నొప్పిని తగ్గించడంతో పాటు మెదడులో తృప్తిని ఇచ్చే  రసాయనాలను ప్రేరేపిస్తాయి. దీనివల్ల మెదడు ఈ మందులకు అలవాటు పడి వాటిపై ఆధారపడటం మొదలుపెడుతుంది. ఈ మందులను వాడడం ఆపేసిన ఎదో ఆందోళన, నిద్రలేకపోవడం, కండరాల నొప్పి లాంటి సమస్యలు వస్తాయి. అందుకే డాక్టర్లకి చెప్పకుండా ఈ మందుల వాడకం ఒక్కసారిగా ఆపడం చాలా కష్టం అని డాక్టర్ కుమార్ హెచ్చరిస్తున్నారు.