కారులో మంటలు.. ఐదుగురు సురక్షితం

కారులో మంటలు.. ఐదుగురు సురక్షితం

 కారులో అందరూ జోరుగా హుషారుగా షికారు చేస్తున్నారు. హైవేపై రయ్..రయ్ అంటూ దూసుకుపోతుంది. అందరూ సరదాగా జర్నీ చేస్తున్న సమయంలో కారు ఒక్కసారిగా కుదుపులకు గురైంది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా దాన్ని అదుపుచేయడం కష్టంగా మారింది. వెంటనే కారును రోడ్డు పక్కన ఆపేశాడు. వెంటనే కారులో నుంచి పొగలు రావడం స్టార్ట్ అయ్యాయి. వెనుక సీటులో ఉన్న డోర్స్ ఓపెన్ కావడంతో అందులో ఉన్న నలుగురు వ్యక్తులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. కానీ డ్రైవర్ వైపు డోర్స్ తెరుచుకోలేదు. దీంతో అతడు బయటకు రాలేకపోయాడు. డ్రైవర్ ను రక్షించేందుకు మిగతావారు తీవ్రంగా ప్రయత్నించారు. చేతులు, రాళ్లు,సుత్తితో కారు అద్దాలను పగలగొట్టారు. అతి కష్టం మీద డ్రైవర్ రక్షించారు. 30 సెకన్ల వ్యవధిలోనే కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఏ మాత్రం ఆలస్యం చేసినా డ్రైవర్ ప్రాణాలు దక్కేవి కాదు. అందరూ సేఫ్ గా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు కారు ప్రమాదానికి సంబంధించిన వీడియోను షూట్ చేశారు. దీన్ని  సోషల్ మీడియాలో  షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ ఘటన కెనడాలోని అంటారియోలో జరిగింది.