మీకు విస్కీ తాగే అల‌వాటు ఉందా.. ఉంటే ఈ స్నాక్స్ ప‌ర్ఫ‌క్ట్ ట‌చ్

మీకు విస్కీ తాగే అల‌వాటు ఉందా.. ఉంటే ఈ స్నాక్స్ ప‌ర్ఫ‌క్ట్ ట‌చ్

రోజంతా చేసిన కష్టాన్ని మర్చిపోయేందుకు కొందరు.. బాధను మర్చిపోయేందుకు ఇంకొందరు.. స్నేహితులు, బంధువులతో పార్టీలు, ఫంక్షన్లతో ఎంజాయ్ చేసేందుకు మరికొందరు.. ఎంచుకునే అత్యంత సాధారణ పనుల్లో బీర్ లేదా విస్కీ షేర్ చేసుకోవడం. అయితే దీనికి మంచింగ్ గా ఎంచుకునే విషయంలోనూ చాలా మంది ఎంతో ఇంట్రస్ట్ చూపిస్తూ ఉంటారు. వాటిల్లో అత్యంత తేలికైన, రుచికరమైన స్నాక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

గింజలు: గింజలు.. విస్కీతో అత్యంత ఉత్తమమైనవిగా చెప్పవచ్చు. ఈ మెత్తటి గింజలు విస్కీతో బాగా కలిసిపోతాయి. క్రంచీగా, ఉప్పగా ఉండే రుచితో పాటు అదనంగా, ఇందులోని తక్కువ కేలరీలు, అధిక ప్రోటీన్‌లు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. కాబట్టి చిరుతిండిగా తీసుకునే ఈ గింజలు విస్కీతో మంచి ఛాయిస్.

పాప్‌కార్న్: పాప్‌కార్న్ విస్కీతో మరొక క్లాసిక్ స్నాక్. ఇది తేలికగా, క్రంచీగా ఉంటుంది. ఇది రుచిగా ఉండడమే కాకుండా.. ఇందులో ఉండే తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఆరోగ్యానికి కూడా మంచివి. కాబట్టి వీటిని ఎలాంటి సందేహం లేకుండా తీసుకోవచ్చు.

చీజ్: చీజ్ ఎల్లప్పుడూ విస్కీకి ఓ గొప్ప కాంబోగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్, కాల్షియంలు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఈ చిరుతిండిని విస్కీతో తీసుకోవడం రుచికరంగానూ ఉంటుంది.

ఆలివ్‌లు: ఆలివ్‌లను విస్కీతో జోడించడం కాస్త ఆశ్చర్యానికి గురి చేసినా.. ఈ రెండింటి కలయిక మంచి రుచిని అందిస్తుంది. ఉప్పగా ఉండే దీని రుచి.. విస్కీ తీపితో అద్భుతంగా జత కడుతుంది. చిన్న చిన్న సిప్స్ మధ్యలో దీన్ని తీసుకుంటే ఆ అనుభూతే వేరు. అంతే కాదు ఆలివ్‌లలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్‌లు కూడా పెద్ద మొత్తంలో ఉంటాయి.

క్రాకర్స్: క్రాకర్స్ విస్కీతో జత చేయడానికి మరొక గొప్ప చిరుతిండిగా చెప్పవచ్చు. ఇవి విస్కీ సెన్సిటివిటీకి అద్భుతమైన క్రంచీ రుచిని అందిస్తాయి. దీంతో పాటు క్రాకర్స్ లో ఉండే తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కారణంగా నిస్సంకోచంగా వీటిని ఆస్వాదించవచ్చు.

పైన చెప్పిన వాటిలో మీకు ఇష్టమైన విస్కీతో జత చేయండి. ఆ రుచిని ఆస్వాదించండి. ఈ తేలికపాటి స్నాక్స్ తో మధురమైన క్షణాలను మరింత అద్భుతంగా మరల్చుకోండి.