ఇది క్రికెట్ యాపారం : ముంబైలో హోటల్ రూం లక్ష రూపాయలు.. అవాక్కయ్యారా..!

ఇది క్రికెట్ యాపారం : ముంబైలో హోటల్ రూం లక్ష రూపాయలు.. అవాక్కయ్యారా..!

వరల్డ్ కప్ 2023 లీగ్ మ్యాచ్ లు ముగిసాయి. ఇక మిగిలింది నాకౌట్ మ్యాచ్ లు మాత్రమే. రెండు సెమీ ఫైనల్స్ తో పాటు ఫైనల్స్ తో ఈ మెగా టోర్నీకి ఎండ్ కార్డు పడుతుంది. ఇందులో భాగంగా మొదటి సెమీ ఫైనల్ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు(నవంబర్ 15) ముంబై వేదికగా జరగనుంది. వాంఖడే స్టేడియంలో జరగనున్న ఈ సెమీస్ కు క్రేజ్ ఆకాశాన్ని దాటేసింది. సొంతగడ్డపై టీమిండియా సెమీ ఫైనల్ ఆడుతుండడంతో ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. 

ముంబైలో సెమీ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అభిమానులు  హోటల్లో దిగారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడ హోటల్ రేట్స్ చూస్తే షాకవ్వాల్సించే. ఇక్కడ 
హోటల్ రేట్ సాధారణ రేట్ కంటే 80 శాతం పెంచేశారు. ఒక నైట్ ఇక్కడ ఉండాలంటే భారీగా చెల్లించాల్సిందే. వరల్డ్ కప్ క్రేజ్ ను 
దృష్టిలో ఉంచుకుని హోటల్ ధరల అమాంతం పెంచేశారు యజమానులు. డిమాండ్ ను క్యాష్ చేసుకుంటున్నారు.
-Colabaలోని తాజ్ మహల్ ప్యాలెస్ వంటి ఫేమస్ హోటళ్లు నవంబర్ 14వ తేదీ ఒక్క రోజుకు 56 వేలు వసూలు చేస్తున్నారు.
-తాజ్ మహల్ టవర్ లో ఒక రోజుకు 41 వేల 300 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు.
-ముంబైలోని దేశీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న తాజ్ శాంతాక్రూజ్ ఒక రాత్రికి 19 వేల రూపాయలు చెబుతున్నారు.
-5 స్టార్ హోటల్స్ దిమ్మతిరిగే రీతిలో ఒక్క రోజుకు 90 వేల రూపాయలకు చేరుకుంది. అయినా గదులు దొరకటం లేదంటున్నారు వ్యాపారవేత్తలు

ముంబైలో హోటల్స్ అంటే సహజంగానే భారీ రేట్ ఉంటాయి. నాలుగేళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్ లో మరోసారి కివీస్ తో పోరుకు భారత్ సిద్ధమవుతుంది. 2019 లో జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో న్యూజీలాండ్ 18 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ సారి సొంతగడ్డపై బ్లాక్ క్యాప్స్ పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు.      

ALSO READ : Cricket World Cup 2023: తప్పు నాదే.. కోహ్లీ విషయంలో అలా మాట్లాడకుండా ఉండాల్సింది: శ్రీలంక కెప్టెన్