గుజరాత్​లో నీటమునిగి ఐదుగురు టీనేజర్లు దుర్మరణం

గుజరాత్​లో నీటమునిగి ఐదుగురు టీనేజర్లు దుర్మరణం

బోతాద్: గుజరాత్​లోని బోతాద్​​జిల్లా కృష్ణసాగర్​ లేక్​లో మునిగి ఐదుగురు టీనేజర్లు శనివారం మృతిచెందారు. బోతాద్​ పట్టణం శివారులో ఉన్న లేక్​లో ఈత కొట్టేందుకు దిగిన ఇద్దరు నీటిలో మునిగిపోయారు. వీరిని రక్షించేందుకు లేక్ లో దూకిన మరో ముగ్గురు కూడా నీటమునిగారు. మృతి చెందిన ఐదుగురు మైనర్లేనని పోలీసులు తెలిపారు.

స్థానికులు సమాచారం అందించడంతో రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. అయితే, పిల్లలను రక్షించేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బోతాద్​ ఎస్పీ కిశోర్​ బలోలియా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం ఐదుగురు చనిపోయారని, వీరి వయస్సు 16 నుంచి 17 సంవత్సరాలు మధ్య ఉంటుందని తెలిపారు.