ట్రంప్‎కు నోబెల్ అవార్డు ఇవ్వాలని 5 దేశాధినేతల మద్దతు

ట్రంప్‎కు నోబెల్ అవార్డు ఇవ్వాలని 5 దేశాధినేతల మద్దతు

వాషింగ్టన్: ప్రపంచంలో వివిధ దేశాల మధ్య యుద్ధాలను ఆపుతూ ప్రపంచ శాంతికి కృషి చేస్తున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్​నోబెల్ బహుమతికి అర్హుడని ఆర్మేనియా ప్రధాని నికోల్ పషియాన్ చెప్పారు. ఆయనకు నోబెల్ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. అజర్ బైజాన్  ప్రెసిడెంట్ ఇల్హం అలియెవ్ కూడా ఇదే డిమాండ్​ చేశారు. శనివారం వైట్ హౌస్‎లో ట్రంప్​తో నికోల్, అలియెవ్  భేటీ సందర్భంగా ఈమేరకు ప్రతిపాదన చేశారు. దీంతో ట్రంప్​కు నోబెల్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్న దేశాల సంఖ్య ఐదుకు చేరింది. పాకిస్తాన్, ఇజ్రాయెల్, కంబోడియా దేశాధినేతలు ట్రంప్​కు నోబెల్ ఇవ్వాలని ప్రతిపాదించారు.