నీటి సంపులో పడి బాలుడు మృతి

V6 Velugu Posted on Jun 06, 2019

హైదరాబాద్: మలక్ పేట్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి అబ్దుల్ రెహమాన్ అనే 5 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. మలక్ పేట్ పీఎస్ పరిధిలో నివసించే ఓ కుటుంబానికి చెందిన బాలుడు ఆడుకుంటూ ఎదురుగా నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోని నీటి సంపు లో పడి మృతి చెందాడు.

బాలుడి మరణించిన సంగతి తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. ఆ నూతన భవంతికి ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడం వల్లే తమ బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తున్నారు.  ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని , పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. స్థానిక ఎమ్మెల్యే సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చి , పరామర్శించారు

Tagged Died, WATER, Malakpet, 5 year old boy

Latest Videos

Subscribe Now

More News