బాలుడిని చంపి.. రైలు టాయిలెట్ డస్ట్బిన్లో పడేశారు

బాలుడిని చంపి.. రైలు టాయిలెట్ డస్ట్బిన్లో పడేశారు

ముంబై: ముంబైలోని ఓ రైలులో ఐదేండ్ల బాలుడి మృతదేహం లభ్యమైంది. ట్రైన్​లోని ఓ కోచ్​ను శుభ్రం చేస్తుండగా శనివారం కార్మికులు ఆ డెడ్ బాడీని గుర్తించారు. కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినస్​లో కుషి నగర్ ఎక్స్ ప్రెస్ ఏసీ కోచ్​ను శుభ్రం చేస్తుండగా కార్మికులు బాలుడి మృతదేహాన్ని చూశారు.

 షాక్ కు గురైన కార్మికులు వెంటనే స్టేషన్ మేనేజ్ మెంట్ కు సమాచారం ఇచ్చారు. రైల్వే అధికారులు, పోలీసులు స్పాట్​కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం రాత్రి బాలుడి తల్లి గుజరాత్‌‌ సూరత్​లో ఉన్న తన 25 ఏండ్ల సమీప బంధువు వికాస్ షాపై తమకు ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. 

షా తన కొడుకును కిడ్నాప్ చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. బాలుడి మృతదేహం చెత్తబుట్టలోకి ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి రైల్వే, గవర్నమెంట్ రైల్వే పోలీస్ అధికారులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.