జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలందిస్తాం : డాక్టర్ రవీందర్ నాయక్

జాతరకు వచ్చే భక్తులకు  మెరుగైన వైద్యసేవలందిస్తాం : డాక్టర్ రవీందర్ నాయక్
  • జాతరలో 50 బెడ్స్ ఆస్పత్రి, 30 హెల్త్ క్యాంపులు 
  • రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్​ రవీందర్​ నాయక్

ములుగు, తాడ్వాయి, వెలుగు: మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలందిస్తామని స్టేట్ హెల్త్ డైరెక్టర్  డాక్టర్​రవీందర్​నాయక్​తెలిపారు.  శనివారం మేడారంలో ములుగు డీఎంహెచ్ఓ గోపాల్​రావు, హన్మకొండ డీఎంహెచ్​వో అప్పయ్యతో కలిసి పర్యటించారు. భక్తులకు సేవలందించేందుకు 50 బెడ్స్ ఆస్పత్రి, వైద్యశిబిరాల ప్రాంతాలను పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం మెడికల్ ఆఫీసర్లతో సమీక్షించారు.

 జాతర వచ్చే భక్తులకు ఎలాంటి అనార్యోగ సమస్యలు వచ్చినా వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సరిపడా మెడిసిన్ అందుబాటులో ఉంచుకుని జిల్లా, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది, టీమ్ వర్క్ తో  సేవలందించాలని ఆదేశించారు.  ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని వైద్య శిబిరాల ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు.  డిప్యూటీ డీఎంహెచ్ఓ విపిన్ కుమార్, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు చంద్రకాంత్, శ్రీకాంత్, రణధీర్, డెమో సంపత్, డీపీఎం ఎం.సంజీవరావు, విప్లవ్, తిరుపతి, కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.