జనగామ అర్బన్, వెలుగు: ఫ్రాంక్లిన్ టెంప్లీటన్ సంస్థ రౌండ్ టేబుల్ ఇండియా వారి సహకారంతో జనగామ జిల్లా కేంద్రంలోని జడ్పీ హెచ్ఎస్లో అసంపూర్తి భవనాన్ని పూర్తిచేసి విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ భవనాన్ని శనివారం కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలు సమాజ బాధ్యతతో ముందుకు వచ్చి విద్యాభివృద్ధికి తోడ్పడటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు నాగలక్ష్మి, సునీల్ కుమార్, అఖిల్, మాధవ రెడ్డి, కార్తీక్, జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యమూర్తి, డీసీఈబీ సహాయ కార్యదర్శి మెరుగు రామరాజు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
