పాక్ చేరిన 500 మంది భారత సిక్కులు

పాక్ చేరిన 500 మంది భారత సిక్కులు

భారతదేశానికి చెందిన 500 మంది సిక్కులు పాకిస్తాన్ గడ్డమీద అడుగుపెట్టారు. సిక్కుల మత గురువు గురునానక్ 550 జయంతి ఉత్సవాల సందర్భంగా వారు పాక్ లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్ నాన్కన సాహిబ్ ను సందర్శించబోతున్నారు. ఈ క్రమంలోనే 500 మంది సిక్కోలు మంగళవారం భారత్-పాక్ బోర్డర్ దాటారు. వారికి పాక్ గ్రాండ్ వెల్ కమ్ చెప్పింది. ఢిల్లీ గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్మన్ మన్జీందర్ సింగ్ సిర్సా నేతృత్వంలో వీరు పాక్ కు పయనమయ్యారు.

నాన్కన సాహిబ్ లోను గురునానక్ జన్మించారని..అతడు పుట్టిన స్థలాన్ని సందర్శిస్తే తమ జన్మధన్యమవుతుందని చెప్పారు పాక్ కు బయలుదేరినవారు.తమ దేశంలో అడుగు పెట్టిన ఈ సిక్కుల ప్రతినిధుల బృందం సభ్యులకు పాకిస్తాన్ రాయబార కార్యాలయం వసతి ఏర్పాటు చేసింది. దౌత్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి వారందరికీ ఇదివరకే విసాలాను జారీ చేసినట్లు భారత్ లోని పాకిస్తాన్ రాయబార కార్యలయం అధికారులు తెలిపారు.