గృహప్రవేశానికి 5 వేల ఇందిరమ్మ ఇండ్లు రెడీ

గృహప్రవేశానికి 5 వేల ఇందిరమ్మ ఇండ్లు రెడీ
  • రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 5 వేల ఇండ్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ అన్నారు. శ్రావణ మాసంలో గృహప్రవేశాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.మరో 8 వేల ఇండ్లకు స్లాబ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1.73 లక్షల ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, 57వేల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని వివరించారు. లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 386.12 కోట్లు జమ చేశామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడతలో నిరుపేదలకు  ప్రాధాన్యం ఇచ్చామన్నారు. టెక్నాలజీ సాయంతో 12,700 మంది లబ్ధిదారుల వివరాలపై అభ్యంతరాలు గుర్తించామని చెప్పారు.