ఫుడ్ ​ప్రాసెసింగ్​ సెక్టార్​కు మరింత చేయూతను ఇస్తం: పీఎం మోదీ

ఫుడ్ ​ప్రాసెసింగ్​ సెక్టార్​కు మరింత చేయూతను ఇస్తం:  పీఎం మోదీ

న్యూఢిల్లీ: మనదేశ ఫుడ్​ ప్రాసెసింగ్ రంగం "సన్​రైజ్​" ఇండస్ట్రీగా ఎదిగిందని, గత తొమ్మిదేళ్లలో రూ.50వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఐ) ఆకర్షించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ రంగం అభివృద్ధి కోసం ఇది వరకే ఏడు వేల ఫార్మర్​ ప్రొడ్యూసర్​​ ఆర్గనైజేషన్స్​ (ఎఫ్​పీఓలు) ఏర్పాటు చేశామని, వీటి సంఖ్యను పది వేలకు పెంచుతామని చెప్పారు.  దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా రెండో ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన ప్రసంగించారు.  

ప్రభుత్వ అనుకూల, పరిశ్రమలు  రైతు అనుకూల విధానాల వల్లే ఇంత భారీగా పెట్టుబడులు వచ్చాయని అని మోదీ అన్నారు. గత తొమ్మిదేళ్లలో ప్రాసెస్డ్ ఫుడ్ ఎగుమతులు 150శాతం పెరిగాయని, దేశీయ ప్రాసెసింగ్ సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు.  ఈ సందర్భంగా ప్రధానమంత్రి లక్షకు పైగా స్వయం సహాయక బృందాలకు (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ) సీడ్ క్యాపిటల్ సహాయాన్ని పంపిణీ చేశారు.  'వరల్డ్ ఫుడ్ ఇండియా 2023'లో భాగంగా 'ఫుడ్ స్ట్రీట్'ను ప్రారంభించారు.  

భారతదేశాన్ని 'ప్రపంచ ఆహారపు బుట్ట'గా ప్రదర్శించడం,  2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా జరుపుకోవడాన్ని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. దీని మొదటి ఎడిషన్ 2017లో జరిగింది కానీ కరోనా కారణంగా వరుసగా కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహించడం సాధ్యం కాలేదు. 'సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్'  మెరుగైన ప్యాకేజింగ్  నాణ్యమైన తయారీ ద్వారా మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెరుగైన ధరను పొందేందుకు ఎస్​హెచ్​జీలకు సహాయం చేస్తుంది. 

ఈ సందర్భంగా కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి పశుపతి కుమార్ పరాస్ మాట్లాడుతూ, ఈ రంగంలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని విదేశీ పెట్టుబడిదారులను కోరారు. మోదీ ప్రభుత్వం దేశ ఆహార భద్రతకు భరోసా కల్పించిందని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రోత్సాహాన్ని అందించిందని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గత తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ఆయన ఈ సందర్భంగా వివరించారు. 

భారీ సంఖ్యలో సంస్థలు, నిపుణుల హాజరు

ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమ నిపుణులు, రైతులు, వ్యవస్థాపకులు,  ఇతర వాటాదారులకు చర్చలలో పాల్గొనడానికి, భాగస్వామ్యాలను స్థాపించడానికి  వ్యవసాయ, -ఆహార రంగంలో పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి వరల్డ్ ఫుడ్ ఇండియా నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్కింగ్  వ్యాపార వేదికను అందిస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించే సీఈఓల రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పెట్టుబడులు,  వ్యాపారాన్ని సులభతరం చేయడంపై దృష్టి పెడతాయి. భారతీయ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ,  ఆవిష్కరణ  శక్తిని ప్రదర్శించడానికి వివిధ పెవిలియన్లను ఏర్పాటు  చేశారు. మూడు రోజుల ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలోని వివిధ అంశాలపై దృష్టి సారించే 48 సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నిర్వహిస్తారు.

ఆర్థిక సాధికారత, నాణ్యత హామీ,  యంత్రాలు, టెక్నాలజీలో ఇన్నోవేషన్లకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రముఖ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల సీఈఓలతో సహా 80కి పైగా దేశాల నుంచి ఈ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొనే అవకాశం ఉంది. దాదాపు 1,200 మంది విదేశీ కొనుగోలుదారులతో 'రివర్స్ బయ్యర్​ సెల్లర్ మీట్' కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. వరల్డ్ ఫుడ్ ఇండియా రెండో ఎడిషన్ సందర్భంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగం రూ.75వేల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని గత నెలలో ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.