ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

వెలుగు, నెట్​వర్క్​: ఉమ్మడి మెదక్​జిల్లా వ్యాప్తంగా ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్​ పటేల్‌ 150వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దేశ ఐక్యతకు పటేల్ ఇచ్చిన పిలుపును ప్రతిబింబిస్తూ రన్ ఫర్ యూనిటీ పేరుతో మారథాన్ పోటీలు  జరిపారు. మెదక్​ జిల్లాలో ఏఎస్పీ మహేందర్​ జెండా ఊపి 2కె రన్​ ప్రారంభించారు. బోధన్ చౌరస్తా నుంచి ప్రారంభమైన రన్​ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద ముగిసింది. 

బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేశ్ గౌడ్ ఆధ్వర్యంలో సైతం యూనిటీ రన్ నిర్వహించారు. పాపన్నపేటలో ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో, తూప్రాన్ లో సీఐ రంగాకృష్ణ ఆధ్వర్యంలో, శివ్వంపేటలో పోలీసుల ఆధ్వర్యంలో, నిజాంపేటలో ఎస్ఐ రాజేశ్ ఆధ్వర్యంలో, మనోహరాబాద్​లో ఎస్ఐ సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో రన్నింగ్​నిర్వహించారు. గెలిచిన వారికి బహుమతులను అందజేశారు. 

సంగారెడ్డి పట్టణంలో ఎస్పీ పరితోశ్ పంకజ్, అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రన్​ఫర్​యూనిటీ నిర్వహించారు. కలెక్టర్ ఆఫీసు నుంచి ఐబీ ఆఫీస్​వరకు ర్యాలీ కొనసాగించారు. సదాశివపేటలో సీఐ వెంకటేశ్ ఆధ్వర్యంలో, అమీన్​పూర్​మున్సిపాలిటీ​పరిధిలోని సుల్తాన్​పూర్​లో డీఎస్పీ ప్రభాకర్​ఆధ్వర్యంలో, సిద్దిపేట పట్టణంలో ఏసీపీ రవీందర్​రెడ్డి ఆధ్వర్యంలో రన్నింగ్​పోటీలను నిర్వహించారు. చేర్యాల పట్టణంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ స్కూల్ బాయ్స్, గర్ల్స్, కేజీబీవీ గర్ల్స్  పాల్గొన్నారు.