హెడ్మాస్టర్ ఇంట్లో ఫంక్షన్.. ఫుడ్ పాయిజనింగ్‌తో 100 మంది ఆస్పత్రిపాలు

హెడ్మాస్టర్ ఇంట్లో ఫంక్షన్.. ఫుడ్ పాయిజనింగ్‌తో 100 మంది ఆస్పత్రిపాలు

స్కూల్ హెడ్మాస్టర్ ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లి ఆహారం తిన్న తర్వాత డయేరియా, వాంతులు కావడంతో దాదాపు 100 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఇందులో 51 మంది పిల్లలే ఉన్నారు. ప్రస్తుతం అందరి క్షేమంగానే ఉన్నారు. చత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లా అన్సులా గ్రామంలో ఈ ఘటన జరిగింది.

అన్సులా గ్రామంలోని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్‌ హెడ్మాస్టర్ ఇంట్లో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఫంక్షన్‌లో బంధువులతో పాటు టీచర్లు, స్కూల్ పిల్లలు కూడా పాల్గొన్నారు. ఫంక్షన్‌లో భోజనాలు చేశాక.. చాలా మందికి పొట్ట కరాబైంది. ఉన్నట్టుండి వాంతులు, మోషన్స్ తగులుకున్నాయి. దీంతో వారందరినీ సమీపంలో ఉన్న పితోరా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌కు తరలించారు. దాదాపుగా వంద మంది ఆస్పతిపాలు కాగా, అందులో 51 మంది పిల్లలే ఉన్నారు. గ్రామంలో జరిగిన ఈ ఘటన గురించి జిల్లా కలెక్టర్ దోమన్ సింగ్‌కు తెలియడంతో ఆయన వెంటనే ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వాకబు చేశారు. ప్రస్తుతం అంతా క్షేమంగానే ఉన్నారని, ఎవరి కండిషన్ కూడా సీరియస్ కాలేదని దోమన్ సింగ్ చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

హత్యలతో నిరసనలను అణచివేయలేరు: బీజేపీ ఎంపీ వార్నింగ్

చీకటి దశను అధిగమించాల్సిందే: షారుఖ్​ కొడుక్కి హృతిక్ లేఖ

కేటీఆర్ సార్.. మా దళిత వాడను పట్టించకోండి: చిన్న పిల్లల మొర